తాజావార్తలు

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌, అంచనాలు పెంచేస్తున్న నడిప్పిన్ నాయగన్‌ లైనప్‌


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన “కరుప్పు” బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా, ఆ తర్వాత వచ్చిన “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రికార్డు గ్రాస్ వసూలు చేసి, కేవలం రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయసు వెనక్కి వెళ్తున్న ఇద్దరు హీరోలలో సూర్య ఒకరైతే, మరొకరు మహేష్ బాబు అంటూ ప్రశంసించారు. “గజిని”, “సూర్య సన్నాఫ్ కృష్ణన్” వంటి చిత్రాల్లో సూర్య పాత్రలు దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయన్నారు. అంతేకాకుండా, తాను సూర్యకు నచ్చే కథను ఇంకా చెప్పలేకపోయానని, అయితే త్వరలోనే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో పెద్ద ఎత్తున అంచనాలను పెంచాయి.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *