అయితే చంద్రుడు సింహ రాశిని వదిలి పెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇలా కన్యారాశిలోకి సంచారం చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఈ రాశుల వారు చాలా చల్లగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.
మేష రాశి : మేష రాశి వారికి చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వలన కలిసి వస్తుంది వీరు డబ్బును సంపాదించడంలో, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో ముందుంటారు. అన్నిరంగాల్లో వీరిదే పై చేయి అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు
తుల రాశి : వీరికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేపట్టినా, దానిని పూర్తి చేసేవరకు విశ్రమించరు. సంపద పెరుగుతుంది. సమాజంలో కూడా ఈ రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.
మకర రాశి : వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగా మెదులుతారు. వీరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో వీరికి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి
మీన రాశి : వీరు చాలా ధైర్యవంతులు. వ్యాపారం, భూమి లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. అన్నివిధాలుగా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో వీరిదే పై చేయి అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.





