తాజావార్తలు

సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్.. కట్‌చేస్తే.. భారతీయ రైల్వే సంచలన నిర్ణయం..

సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్.. కట్‌చేస్తే.. భారతీయ రైల్వే సంచలన నిర్ణయం..


భారతీయ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైళ్లకు సమయపాలన, భద్రత అత్యంత కీలకం. అయితే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఒక విచిత్రమైన ఘటన రైల్వే శాఖను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ప్రయాణికుల భద్రతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేలా చేసింది. కేవలం సమోసాల కోసం ఒక లోకో పైలట్ ప్యాసింజర్ రైలును నడిరోడ్డుపై ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద ఆపేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

వైరల్ అయిన వీడియో ప్రకారం.. అల్వార్‌లోని దాద్ కరౌలి రైల్వే క్రాసింగ్ వద్దకు ఒక ప్యాసింజర్ రైలు వచ్చి ఆగిపోయింది. రైలు వస్తోందని గేట్‌మెన్ అప్పటికే గేట్లు మూసివేయడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే స్టేషన్ రాకముందే, క్రాసింగ్ గేటుకు అతి సమీపంలో డ్రైవర్ రైలును ఆపేశాడు. వెంటనే ట్రాక్ పక్కన నిలబడిన ఒక వ్యక్తి చేతిలో ఉన్న వేడి వేడి సమోసాల ప్యాకెట్‌ను లోకో పైలట్ క్యాబిన్ వైపు అందించాడు. డ్రైవర్ దానిని అందుకోగానే, రైలు హారన్ మోగిస్తూ ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ట్రాఫిక్‌లో ఆగిన ఒక వాహనదారుడు తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి



రైల్వే శాఖ ఆగ్రహం – ఐదుగురు సస్పెండ్:

ఈ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఉత్తర పశ్చిమ రైల్వే విభాగం తీవ్రంగా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం, రైల్వే నిబంధనలను ఉల్లంఘించి, ప్రయాణికుల ప్రాణాలను, ప్రజా రక్షణను ప్రమాదంలో పడేసినందుకు గానూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు లోకో పైలట్ల తో పాటు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించి వారికి సహకరించిన ముగ్గురు రైల్వే గేట్‌మెన్లను కూడా తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే పిఆర్ఓ కపిల్ శర్మ ప్రకటించారు.

వీడియో ఇక్కడ చూడండి..

అయితే స్థానికుల కథనం ప్రకారం.. ఈ క్రాసింగ్ వద్ద సమోసాల కోసం రైలు ఆపడం ఇదే మొదటిసారి కాదట. అక్కడ దొరికే సమోసాలు చాలా రుచిగా ఉండటంతో, తరచూ డ్రైవర్లు రైలు వేగాన్ని తగ్గించి లేదా ఆపి మరీ సమోసాలు తీసుకుంటుంటారని చెబుతున్నారు. సమోసాల కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రైల్వేస్ పై మండిపడ్డారు. ఈ ఘటన తర్వాత రైల్వే అధికారులు స్పందిస్తూ.. డ్రైవర్లు తమ విధుల్లో ఉన్నప్పుడు ఎలాంటి అనధికారిక స్టాపులు ఇవ్వకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే ఉద్యోగాల నుండి తొలగించేందుకు కూడా వెనకాడబోమని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *