మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో పోసాని చెప్పే డైలాగ్ గుర్తుందా..? ఇప్పుడు రాజమౌళిని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు మీరు మారిపోయారు సర్ అని..! కారణమేంటో తెలియదు కానీ వారణాసి కోసం బాగా మారిపోయారు జక్కన్న. మరి మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. రాజమౌళి మేకింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? ఒక్కో సినిమాను ఏళ్లకేళ్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరొచ్చింది. కానీ వారణాసి విషయంలో తన స్టైల్ మార్చుకున్నారు దర్శక ధీరుడు. మహేష్‌కు ప్రత్యేకమైన మినహాయింపులు ఇస్తున్నారు. షూటింగ్ మొదలయ్యాక హీరోకు వెకేషన్ పర్మిషన్ ఇవ్వడం కాదు.. తాను కూడా వెళ్లొస్తున్నారు. మొన్నటి వరకు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేసిన టీం.. తాజాగా కొత్త షెడ్యూల్‌కు రెడీ అయిపోయారు. నెల రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్‌లో మేజర్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరించబోతున్నారు జక్కన్న. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ దీనికోసం పని చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూట్ దాదాపు 90 శాతం అయిపోయినట్లే అంటున్నారు మేకర్స్. వెకేషన్స్, షూటింగ్‌కు మధ్యలో బ్రేకులు ఇస్తున్నా.. జక్కన్న కెరీర్‌లో ఈగ తర్వాత అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న సినిమా వారణాసి కావడం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్ట్ నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది. జక్కన్న కూడా ఇదే చెప్తున్నారు. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి.. జనవరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసేలా పక్కా స్కెచ్ వేశారు. ఆ తర్వాత 3 నెలల పాటు గ్లోబల్ ప్రమోషన్స్ చేసి.. ఏప్రిల్ 7, 2027న ఆన్ టైమ్ దండయాత్రకు సై అంటున్నారు. మొత్తానికి వారణాసి కోసం తన వర్కింగ్ స్టైల్ అయితే బాగా మార్చేసారు దర్శక ధీరుడు. ఇప్పటికైతే ప్లాన్ అదిరింది.. అప్లై అయితే ఇంకా అదురుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి
Jio: జియో బంపర్ ఆఫర్..కేవలం రూ.200కే అన్నీ..!
ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి
మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే
