రీఛార్జ్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత కూడా మీరు తిరిగి రీఛార్జ్ చేసుకోకపోతే టెలికాం కంపెనీలు ఇన్‌కమింగ్‌తో పాటు అవుట్ గోయింగ్, ఎస్ఎంఎస్ సేవలన్నీ నిలిపివేస్తాయి. మీకు ఎవరూ కాల్ లేదా మెస్సేజ్ చేయలేరు. మళ్లీ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ మీరు ఇతరుల నుంచి కాల్స్ లేదా మెస్సేజ్‌లు అందుకోలేరు. ఇలాంటి సమయంలో మీరు కనీస బేసిక్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ సిమ్ యాక్టివేట్ అవుతుంది.
కొన్ని నెలల పాటు మీరు సిమ్ వాడకుండా అలాగే ఉంచితే.. మీ పేరు మీద ఇనాక్టివ్ చేసి వేరేవారికి కేటాయిస్తారు. మీ సిమ్ కార్డ్ పోకుండా ఉండాలంటే బేసిక్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే ఎయిర్ టెల్, జియోలో బేసిక్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా జియో, ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ అందిస్తున్నాయి. అనేక జిల్లాల్లో 5జీ సేవలు లభిస్తున్నాయి. దీంతో 5జీ సేవలు పొందాలంటే పైన వివరించిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. త్వరలో టెలికాం కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. రానున్న రోజుల్లో దాదాపు 12 నుంచి 15 శాతం మేర ధరలను పెంచవచ్చని తెలుస్తోంది.
ఇక ఎయిర్ టెల్ కస్టమర్లు అయితే రూ.199 రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉండాలని కోరుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇక రూ.299 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1జీబీ డేటా పొందవచ్చు.
జియో కస్టమర్లు అయితే రూ.189 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ సిమ్ యాక్టివ్ అవ్వడంతో పాటు కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు, 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ పూర్తి అయ్యాక 64kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, లైవ్ టీవీ, ఓటీటీ కంటెంట్, క్లౌడ్ స్టోరేజీ కూడా లభిస్తాయి.





