Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా…
