చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్
కాన్పూర్, ఆగస్ట్ 25: సాధారణంగా చెత్త కుప్పల వద్ద విలువైన వస్తువుల కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడటం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. చెత్తను డంప్ చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకోవడం కనిపిస్తోంది. కొందరు నేలపై పడివున్న…
