Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించేందుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారు. డీపీఆర్ తయారుచేసేందుకు ఇప్పటికే సర్వే చేపడుతున్నామని, అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మాల్కా్‌జ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బదులిస్తూ. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే…
