తాజావార్తలు
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..? తప్పక తెలుసుకోండి..

వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..? తప్పక తెలుసుకోండి..

సులభంగా జీర్ణమయ్యే చికెన్: తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ కోరుకునే వారికి స్కిన్‌లెస్ చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను తక్కువ కేలరీలతో అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మటన్‌తో పోలిస్తే చికెన్ శరీరానికి సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే జింక్, ప్రోటీన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా…

Read More
ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్న బీజేపీ, అక్కడ ప్రభుత్వాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ కీలక బాధ్యతను కేంద్ర హోం…

Read More
Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ‘కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య 7000లకు చేరింది. ఇది…

Read More
బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..

బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..

ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి జరగడం మణికొండ ప్రాంతంలో కలకలం రేపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి చెందిన ట్యాంకర్ డ్రైవర్ మణికంఠపై జరిగిన దాడిని ది సిటిజన్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా మణికంఠ తనకు కేటాయించిన ప్రాంతానికి తాగునీటి సరఫరా కోసం వెళ్లాడు. ఈ…

Read More
Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?

Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయాన్ని సందర్శించింది. అక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ క్రమంలో ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే శ్రీలీల మాత్రం ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల అరుణాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి…

Read More
Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

బిజినెస్‌ అంటే చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. ఒక ఆఫీస్‌, ఫ్యాక్టరీ, వర్కర్లు, వస్తువుల తయారీ అబ్బో చాలానే అనుకుంటారు. కానీ, నిజానికి సరైన బిజినెస్‌ చేస్తే అవేవి లేకుండానే లక్షలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం మన దేశంలోని కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటికి ప్రపంచంలో ఎక్కడైనా భారీ డిమాండ్‌ ఉంటుంది….

Read More
సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్‌ నగరానికి వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించింది. 08517 విశాఖపట్నం టు చర్లపల్లి ఆదివారం (18.01.2026) మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది. 08518 చర్లపల్లి టు విశాఖపట్నం సోమవారం (19.01.2026) ఉదయం…

Read More
మార్కెట్‌లో కొత్త ట్రెండ్! ఉద్యోగం బోర్ కొడుతున్నా వదలడం లేదా? ‘జాబ్ హగ్గింగ్’ భయం

మార్కెట్‌లో కొత్త ట్రెండ్! ఉద్యోగం బోర్ కొడుతున్నా వదలడం లేదా? ‘జాబ్ హగ్గింగ్’ భయం

కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తుంటాయి. గతంలో మనం ‘క్వైట్ క్విట్టింగ్’ (నిశ్శబ్దంగా తప్పుకోవడం), ‘బేర్ మినిమమ్ మండేస్’ వంటి పదాలను విన్నాం. ఇప్పుడు తాజాగా ఉద్యోగ వర్గాల్లో బాగా వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన పదం జాబ్ హగ్గింగ్. అంటే చేస్తున్న పనిలో సంతోషం లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా.. కేవలం భద్రత కోసం ఆ ఉద్యోగాన్ని గట్టిగా హత్తుకుని ఉండిపోవడం. ఈ కొత్త ట్రెండ్ వెనుక ఉన్న కారణాలు, దాని వల్ల కలిగే లాభనష్టాల…

Read More
హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ..

హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ..

కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. 

Read More
ఈ అలవాట్లు మీకున్నాయా? ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోవడానికి కారణాలు ఇవే!

ఈ అలవాట్లు మీకున్నాయా? ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోవడానికి కారణాలు ఇవే!

హిందూ ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన రోజువారీ అలవాట్లు మన అదృష్టం, ఆర్థిక స్థితి, మానసిక శాంతిపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. కొన్ని పనులు పుణ్యకార్యాలుగా పరిగణించబడితే, కొన్ని అలవాట్లు ఇంటి శ్రేయస్సుకు హానికరంగా భావించబడతాయి. తెలియకుండానే చేసే కొన్ని తప్పులు పేదరికం లేదా అశాంతికి కారణమవుతాయని శాస్త్రాలు సూచిస్తాయి. వాటిలో ముఖ్యమైన అలవాట్లు, వాటి ప్రతికూల ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం తీరిక సమయంలో లేదా ఆలోచనలో ఉండగా…

Read More