తాజావార్తలు

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్


Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెడుతున్నారు.

అశ్విని కుమార్ ఐపీఎల్ ప్రయాణం 2025లో మొదలైంది. మార్చి 31, 2025న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన తన మొట్టమొదటి మ్యాచ్‌లో అతను 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కట్ చేస్తే.. మళ్ళీ 385 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 20, 2026న ఐపీఎల్ 2026 సీజన్‌లో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈసారి ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో కూడా అతను సరిగ్గా 4 ఓవర్లు వేసి, 24 పరుగులు ఇచ్చి, అవే 4 వికెట్లు తీశాడు. ఇలాంటి పోలిక చూడడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం.

అశ్విని కుమార్ చేసిన ఈ ప్రదర్శనలో నాలుగు ప్రధానాంశాలు అచ్చం ఒకేలా ఉన్నాయి:

* వికెట్ల సంఖ్య: రెండు మ్యాచ్‌ల్లోనూ (2025, 2026) 4 వికెట్లు తీశాడు.

* సీజన్ ఆరంభం: రెండు మ్యాచ్‌లూ ఆయా సీజన్లలో అతనికి మొదటి మ్యాచ్‌లే.

* ఇచ్చిన పరుగులు: రెండు సార్లూ కూడా సరిగ్గా 24 పరుగులే ఇవ్వడం విశేషం.

* కెప్టెన్ల వికెట్: ఇది అన్నిటికంటే పెద్ద హైలైట్. 2025లో తన తొలి వికెట్ అప్పటి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కాగా, ఇప్పుడు 2026లో తన తొలి వికెట్ గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కావడం విశేషం.

ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, అశ్విని కుమార్ రూపంలో వారికి ఒక తిరుగులేని అస్త్రం దొరికింది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను తికమక పెట్టే అశ్విని, తన వేగంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్ బ్యాటర్లు రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ వంటి పవర్ హిట్టర్లను అతను పెవిలియన్ పంపిన తీరు ముంబై విజయంలో కీలకంగా మారింది. ఇన్నాళ్లూ బుమ్రాకు తోడుగా ఎవరు ఉంటారని వెతుకుతున్న ముంబైకి అశ్విని రూపంలో సరైన సమాధానం దొరికింది.

అశ్విని ప్రదర్శనపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. “గతేడాది అరంగేట్రం మ్యాచ్‌లో అశ్విని ఏం చేశాడో, ఈ ఏడాది కూడా అదే రిపీట్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అతని బౌలింగ్‌లో నిలకడ జట్టుకు పెద్ద బలం. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించడం గర్వంగా ఉంది” అని హార్దిక్ పేర్కొన్నాడు. వరుస ఓటముల తర్వాత ముంబై ఈ మ్యాచ్‌ను 99 పరుగుల తేడాతో గెలవడంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *