తాజావార్తలు

ఈ సినిమాలో నటించను.. తేల్చి చెప్పిన హీరోయిన్.. ఎన్టీఆర్ సర్దిచెప్పిన వినలేదు..

ఈ సినిమాలో నటించను.. తేల్చి చెప్పిన హీరోయిన్.. ఎన్టీఆర్ సర్దిచెప్పిన వినలేదు..


ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని ప్రతి కళాకారుడు ఆశిస్తారు. కొన్నిసార్లు మంచి పాత్రలు తమంతట తాముగా లభిస్తాయి, మరికొన్నిసార్లు ప్రయత్నం ద్వారా దక్కుతాయి. పాత తరం టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనేక మంది హీరోయిన్లు కలిసి నటించారు. వీరిలో సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటివారు ఎక్కువగా నటించిన వారిలో ఉన్నారు. విజయ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలలో ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రాధాన్యత పొందారు. మహా నటి సావిత్రి విషయానికి వస్తే, ఆమె ఎన్టీఆర్ తో కలిసి ఏకంగా 26 సినిమాల్లో నటించారు. అయితే, ఒక సినిమా విషయంలో మాత్రం ఆమె ఎన్టీఆర్ తో విభేదించిన సంఘటన జరిగిందట. ఎన్టీఆర్ తో సావిత్రి విభేదించడం అప్పట్లో పెద్ద చర్చకే దారితీసిందట. దర్శకుడు కేవీ రెడ్డి నేతృత్వంలో విజయ సంస్థ సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించాలని ప్రణాళిక వేసింది. ఈ చిత్రంలో సత్య హరిశ్చంద్రుడి పాత్రకు ఎన్టీఆర్, చంద్రమతి పాత్రకు సావిత్రి ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

ఇతర తారాగణం ఎంపిక జరుగుతున్న సమయంలో, విజయ సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి సావిత్రిని కలిశారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలకు సావిత్రి ఆశ్చర్యపోయారట. సత్య హరిశ్చంద్రలో కరుణ రసం ఉన్న మంచి పాత్ర అని సావిత్రి చెప్పగా, గతంలో విజయ సంస్థ నిర్మించిన జగదేక వీరుని కథలో ఆమెను ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారట సావిత్రి. దానికి అతను ఆ చిత్రంలో గ్లామర్ పాత్ర కోసం బి. సరోజా దేవిని తీసుకున్నారని, ఇప్పుడు సత్య హరిశ్చంద్రలో ట్రాజెడీ పాత్ర కోసం సావిత్రిని ఎంపిక చేయడం అంటే రొమాంటిక్ పాత్రలకు పనికిరారని, కేవలం తల్లి పాత్రలకే ప్రమోట్ చేస్తున్నారని అతను చెప్పాడట.

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

అప్పటివరకు ఈ విషయంపై ఆలోచించని సావిత్రికి ఆ వ్యక్తి మాటలు నిజమే అనిపించాయి. జగదేక వీరుని కథ వంటి మంచి సినిమాలో తనను తప్పించి, ఇప్పుడు పదేళ్ల కుర్రాడికి తల్లిగా నటించే పాత్రను ఇవ్వడం సరికాదని ఆమె భావించారట. ఎన్టీఆర్ తో 26 సినిమాలు చేసినప్పటికీ, ఈ విషయంలో సావిత్రి ఆయనతో విభేదించారు. కేవీ రెడ్డి, ఎన్టీఆర్ లకు నమ్మశక్యం కాని ఒక సాకు చెప్పి సావిత్రి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆర్ ఆమెను సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆమె మాట వినలేదట. సినిమా ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఇది జరగడంతో, కేవీ రెడ్డి మళ్ళీ హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. భానుమతి ఈ పాత్రకు న్యాయం చేయగలరని భావించి ఆయన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. చంద్రమతి పాత్ర గురించి విన్న భానుమతి సంతోషంగా చేస్తానని చెప్పారు. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె కూడా సినిమా చేయనని కబురు పంపారట. సావిత్రి, భానుమతి ఇద్దరూ ఈ పాత్రను ఎందుకు నిరాకరించారో కేవీ రెడ్డికి మొదట అర్థం కాలేదు. చివరికి, కేవీ రెడ్డి ఎస్. వరలక్ష్మిని చంద్రమతి పాత్రకు ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్, కేవీ రెడ్డి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సత్య హరిశ్చంద్ర చిత్రం 1965 ఏప్రిల్ 22న విడుదలైంది. అయితే, ఎంతో కష్టపడి నిర్మించినప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *