Dholes: మన వీధి కుక్కల్లా ఇవి మొరగవ్.. వేట మొదలెడితే దేన్నీ వదలవ్..!
అడవిలో సింహం, పులి, చిరుత వంటి జంతువుల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ ప్రకృతి ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన వేటగాళ్లలో ఒకటి అడవి కుక్క. భారతదేశంలోని అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువులు తమ అసాధారణ తెలివితేటలు, జట్టు సమన్వయం, వేట నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. మన ఇంటి కుక్కల్లా అడవి కుక్కలు సాధారణంగా మొరగవు. వీటి మధ్య సంభాషణ ఎక్కువగా ఈలలు, కూతలు, ప్రత్యేక శబ్దాల ద్వారా జరుగుతుంది. అందుకే వీటిని కొన్నిచోట్ల ‘విస్లింగ్…
