తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?
తెలంగాణలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు ఆలస్యంగా వివాహాలు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో పిల్లలను కనాలనే నిర్ణయం వాయిదా పడుతుండగా.. మరోవైపు సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఆశ్రయించే జంటల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత, నైతికత, రోగుల హక్కుల పరిరక్షణపై చర్చ మొదలైంది. జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1గా పరిగణిస్తారు. అయితే తెలంగాణలో ఈ రేటు ప్రస్తుతం సుమారు 1.5కు…
