తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?
తెలంగాణలో ఎండలు ఎంతగా మండాయో.. బీర్ అమ్మకాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. వేసవి ప్రభావంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా బీర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయ వృద్ధి నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.3,618.41 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.3,272.33…
