Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!
ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. అయితే ఇంత భారీగా భక్తుల రాకపోకలు ఉన్నప్పటికీ, వారికి తగిన వసతి సౌకర్యాలు మాత్రం అందుబాటులో లేవు. ముఖ్యంగా కాటేజీల కొరత భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.భక్తులు సాధారణంగా ఒకరోజైనా ఇంద్రకీలాద్రిపై ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ సరైన గదులు లేకపోవడంతో.. వచ్చి…
