బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో పోతురాజు పాత్ర అత్యంత ముఖ్యమైనది. పురాణాలు, జానపద కథల ప్రకారం… పోతురాజును ఏడుగురు అక్కచెల్లెళ్లైన గ్రామదేవతలకు ఏకైక సోదరుడిగా భావిస్తారు. అమ్మవార్లు ఊరేగింపుగా వస్తున్నప్పుడు వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణగా పోతురాజు ముందు నడుస్తాడు. అందుకే బోనాల ఊరేగింపులో పోతురాజు అమ్మవారి బోనం కంటే ముందు భాగంలో నడుస్తూ ఉంటాడు. పోతురాజు వేషధారణ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉగ్రరూపంతో ఉంటుంది. పోతురాజు ఒంటి నిండా…
