Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..
దేశ రైల్వే చరిత్రలో మరో నూతన శకం మొదలుకానుంది. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు ప్రారంభ తేదీని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ నోటిఫై చేసింది. ఈ రైలు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అలాగే ఎలాంటి పొగ కూడా రాదు. ఇది ప్రారంభమైన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లను…
