Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్ పంపిణీకి రంగం సిద్దం..
ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు….
