WPL 2026 Final Winner : వడోదరలో ఆర్సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన
WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల…
