ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. ఐపీఎస్ అధికారిని అంటూ నమ్మించి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేస్తున్న ఒక కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా ఉంటూ, ఖాళీ సమయంలో రాపిడో డ్రైవర్గా పనిచేసే వెంకటేశ్వరరావుకు రెండు నెలల క్రితం సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఢిల్లీ NIAలో ఐపీఎస్ అధికారిని అని, ప్రస్తుతం సెలవుపై తిరుపతికి వచ్చానని నమ్మబలికాడు. హైదరాబాద్ ఆదాయపన్ను శాఖలో…
