Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!
ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా…
