పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది….
