తాజావార్తలు

OTT Movie: రెండు రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్.. ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు వెబ్ సిరీస్.. మిస్ అవ్వొద్దు

OTT Movie: రెండు రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్.. ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు వెబ్ సిరీస్.. మిస్ అవ్వొద్దు


ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా, ‘సింగ్ గీతం’ , బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేయనున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు వెబ్ సిరీస్ ఇప్పుడు భారీ వ్యూయర్ షిప్ తో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ సాధించి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. స్కూల్ అండ్ కాలేజ్ డేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను చూసేందుకు అప్పటికప్పుడు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. దీంతో ఈ సిరీస్ కు అంతకంతకూ వ్యూయింగ్ మినిట్స్ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ కథ చాలా సింపుల్ గా ఉన్నా స్క్రీన్ ప్లే, సన్నివేశాలు మాత్రం యూత్ ను కట్టి పడేస్తున్నాయి. సంతోష్, వైశాలి స్కూల్ లో క్లాస్ మేట్స్. మనసులు కలవడంతో ఇద్దరూ లవ్ చేసుకుంటారు. అయితే వైశాలి తండ్రి రఘునాథ్ అదే స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేస్తుంటారు. దీంతో రఘునాథ్ ను ఒప్పించి మరీ సంతోష్ పెళ్లికి రెడీ అవుతాడు. అయితే గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కోసం తన ఫ్రెండ్స్ గణేష్, శ్రీకాంత్, ఆనంద్ తో కలిసి సంతోష్ వెళ్తాడు. ఆ క్రమంలో సంతోష్ కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదంలో అతను గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్ కు గతం గుర్తుకు వచ్చిందా? వైశాలితో పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ సిరీస్ కథ.

ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తోన్న ఈ వెబ్ సిరీస్ పేరు గుర్తుకొస్తున్నాయి. బేబీ హీరో విరాజ్ అశ్విన్ (సంతోష్) ఇందులో హీరోగా నటించాడు. వైశాలి (యశశ్రీ) కథానాయికగా చేసింది. అలాగే రోహిణి హట్టంగడి, ప్రియదర్శని రామ్‌, శివన్నారాయణ, వైవా రాఘవ, పవన్‌ సిద్ధు, గోదావరి గోపి, అనిష్‌ కురువిల్ల, మేఘనా సునీల్‌, మధు,రామ్‌చరణ్‌, చక్రి, సిమన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. 90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మాణ భాగస్వామ్యంతో ఈటీవీ విన్ ఈ సిరీస్ ను నిర్మించింది. పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేస్తూ ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ సాధించిందని ఈటీవీ విన్ అధికారికంగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి



ఈటీవీ విన్ ఓటీటీలో గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్..

గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *