తాజావార్తలు

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి.. ఎంత పెద్ద ప్రమాదమో తెలిస్తే నోరెళ్లబెడతారు..

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి.. ఎంత పెద్ద ప్రమాదమో తెలిస్తే నోరెళ్లబెడతారు..


మనలో చాలా మందికి ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. అయితే అలా వెళ్లినప్పుడు మనం బస చేయడానికి హోటల్‌కి వెళ్లడం కామన్. సాధారణంగా మనం హోటల్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే చేసే మొదటి పని ఏంటంటే.. లైట్ల స్విచ్‌లు ఆన్ చేయడం. ఇదొక అలవాటుగా మారిపోయింది. కానీ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గదిలోకి వెళ్లిన వెంటనే లైట్లు వేయడం అస్సలు తెలివైన పని కాదు. నిజానికి మీ వ్యక్తిగత భద్రత కారణాల దృష్ట్యా అలా చేయకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. మీరు హోటల్ గదిలోకి ప్రవేశించినప్పుడు, వెంటనే మీ సామాను కింద పెట్టడం లేదా అన్ని స్విచ్‌లు ఆన్ చేయడం వంటివి చేయకూడదు. దానికి బదులుగా తలుపు దగ్గరే నిలబడి గది చుట్టూ ఒకసారి నిశితంగా పరిశీలించాలి. దీనివల్ల గదిలో వస్తువులు ఎలా అమర్చబడి ఉన్నాయి, ఎక్కడైనా అదనపు వైర్లు లేదా అసాధారణమైన వస్తువులు ఉన్నాయా అనేదానిపై మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆ తర్వాతే రూమ్‌లోకి అడుగు పెట్టాలి.

రూమ్‌లోకి వెళ్లగానే లైట్లు ఎందుకు వేయకూడదనే విషయానికి వస్తే.. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ రోజుల్లో హోటల్ గదులలో రహస్య కెమెరాలు పెడుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. గది పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే, ఇలాంటి సీక్రెట్ కెమెరాల నుండి వచ్చే చిన్నపాటి ఇన్‌ఫ్రారెడ్ లేదా ఎల్‌ఈడీ లైట్లను మనం సులభంగా గుర్తించగలం. ఆ కెమెరా లైట్లు సాధారణంగా చీకటిలో మినుకుమినుకుమంటూ కనిపిస్తాయి. అందుకే లైట్లు వేయడానికి ముందే రూమ్ చీకటిగా ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు, అల్మరాలు, బాత్రూంలు, మంచం కింద క్షుణ్ణంగా చెక్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే లైట్లు ఆన్ చేసుకోవాలి.

ఎలక్ట్రికల్ స్విచ్‌లను తనిఖీ చేయడం కూడా ముఖ్యం. ముఖ్యంగా పాత హోటళ్లలో తరచుగా స్విచ్‌బోర్డులు సరిగ్గా పనిచేయవు. మీకు ఎక్కడైనా వదులుగా ఉన్న తీగలు లేదా విరిగిన స్విచ్‌లు కనిపిస్తే, వాటిని ముట్టుకోకుండా వెంటనే హోటల్ సిబ్బందికి తెలియజేయాలి. వాటిని బాగు చేయమని అడగడం లేదా రూమ్ మార్చమని కోరడం ద్వారా విద్యుత్ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. వీటన్నింటితో పాటు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఎక్సిట్ ముందే తెలుసుకోవడం చాలా అవసరం. మీరు గమనించే ఉంటారు.. ప్రతి హోటల్ గది తలుపు వెనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు సంబంధించిన ఒక మ్యాప్ ఉంటుంది. రూమ్‌లోకి వెళ్లిన వెంటనే దాన్ని తప్పకుండా చూసి ఎగ్జిట్ రూట్ ఎటు ఉందో మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి.

చివరగా మీరు ఏ హోటల్ గదికి చేరుకున్నా సరే.. మీ సేఫ్టీ కోసం వెంటనే ఈ పనులు చేయడం అస్సలు మర్చిపోకండి.

  • గది లోపలికి వెళ్లగానే వస్తువుల అమరికను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
  • ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడటానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం ఎటుందో చూసుకోండి.
  • బాత్రూం, బాల్కనీ ప్రాంతాలను సరిగ్గా పరిశీలించండి.
  • లైట్ స్విచ్‌లు, ఛార్జింగ్ పాయింట్లు లూజ్‌గా ఉన్నాయేమో చెక్ చేయండి.
  • అన్నింటికంటే ముఖ్యంగా చీకటిలో రహస్య కెమెరాల కోసం వెతకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *