తాజావార్తలు

TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు


హైదరాబాద్‌, జూన్‌ 9: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2026 (జూన్‌ సెషన్‌) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌ నంబర్‌, జర్నల్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జూన్‌ 16 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

టెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1, 2లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16 జిల్లాల్లో 61 పరీక్షా కేంద్రాల్లో వీరందరికీ జూన్‌ 16 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకుని నిబంధనలను పాటించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టెట్ 2026 జూన్ సెషన్‌ హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *