తాజావార్తలు

Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!


నల్లమల అడవుల్లో పెద్దపులి గంభీరంగా దర్శనమివ్వడం వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఫర్హాబాద్ సమీపంలో అటవీ శాఖ జిల్లా అధికారి (DFO) రేవంత్ చంద్ర రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అరుదైన దృశ్యం తారసపడింది.

తమ వాహనానికి ఎదురుగా పెద్దపులి స్వేచ్ఛగా, ప్రశాంతంగా సంచరిస్తుండటాన్ని చూసి డీఎఫ్‌ఓ ఆనందం వ్యక్తం చేశారు. అటవీశాఖ నిరంతరం చేపడుతున్న సంరక్షణ చర్యలు, వేటగాళ్ల నిరోధం, నీటి వసతుల కల్పన వంటి కార్యక్రమాల వల్లే నల్లమలలో పెద్దపులుల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామం అటవీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులు, స్థానికులు అటవీ నిబంధనలను పాటిస్తూ, వన్యప్రాణుల రక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంచారం పెరగడం పట్ల పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *