తాజావార్తలు

TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే

TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే


హైదరాబాద్‌, మే 17: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు ఈ రోజు (మే 17) విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్‌ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ సలహాదారు కంచెర్ల కేశవ రావ్‌ చేతుల మీదగా ఈ ఫలితాలు వెల్లడించనున్నా.

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

ఈఏపీసెట్‌ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ మూడు స్ట్రీమ్‌ల ఫలితాలు నేడు వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 పరీక్షల్లో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరిగాయి. ఇక మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,97,241 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 90,977 మంది విద్యార్థులకుగానూ 84,954 మంది అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌కు పరీక్షలు రాశారు.

టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *