నటి రాశి తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను, వ్యక్తిగత నిర్ణయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తేజ సినిమా తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని, ఆ చిత్రం చేయడం వల్ల తనకు నెగిటివిటీ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కెరీర్‌ను దాదాపుగా ఒక మనిషి కెరీర్‌ని నాశనం చేసినట్లు తాను భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ గారు అడిగిన లుక్ కోసం తాను ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం లెన్స్‌లు, లిప్‌స్టిక్, డార్క్ కాజల్‌తో కనిపించానని, నిజం కోసం ఒక ట్రైనర్‌ను పెట్టుకుని బరువు కూడా తగ్గించానని వివరించారు.
