గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సిరీస్ లో చూపించారు. హారర్, మిస్టరీ, సైకలాజికల్ అంశాలతో పాటు ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఈ సిరీస్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉండడం విశేషం. స్టోరీ విషయానికి వస్తే.. సీరిన్ అనే హైస్కూల్‌లో చదివే కొందరు విద్యార్థులకు ‘గిరిగో’ అనే ఒక వింత యాప్ పరిచయమవుతుంది. తమ మనసులోని కోరికను ఒక వీడియో తీసి అప్‌లోడ్ చేస్తే చాలు, అది నెరవేరుతుంది. వినడానికి ఇది కొంచెం కొత్తగా అనిపించినా, అక్కడే అసలు ప్రమాదం ఉంది. అదేంటంటే.. కోరిక తీరిన మరుక్షణం నుంచే సదరు విద్యార్థి మరణానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. అంటే ముందు విద్యార్థుల కోరికలు తీర్చే గిరిగో యాప్ ఆ తర్వాత వారి ప్రాణాలను బలికోరుతుందన్న మాట. మరి ప్రాణాలు తీసే ఆ మొబైల్ యాప్ వెనక ఉన్న మిస్టరీ ఏంటి? విద్యార్థులు ఆ యాప్ ఉచ్చు నుంచి ఎలా బయటపడ్డారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఆద్యంతం ఆసక్తికరంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సిరీస్ పేరు ‘ఇఫ్ విషెస్ కుడ్ కిల్’ (If Wishes Could Kill). ఇదొక కొరియన్ యంగ్ అడల్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో నటించిన వారందరూ కొరియన్ నటీనటులే. జియోన్ సో-యంగ్, కాంగ్ మి-నా, బేక్ సన్-హో, హ్యూన్ వూ-సిక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఇఫ్ విషెస్ కుడ్ కిల్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వారం వారం ఎపిసోడ్ల కోసం ఎదురుచూసే పని లేకుండా, అన్ని ఎపిసోడ్లను ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అయితే ఈ సిరీస్ ను పిల్లలతో చూడకపోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి
నెట్ ఫ్లిక్స్ లో కొరియన్ వెబ్ సిరీస్..
I found out that the director of my favorite series “Moving,” Park Yoon-seo, has a new show, so I started watching “If Wishes Could Kill (GIRIGO).”It begins like a laid-back school drama. The cast is great, and the characters are well crafted. The premise—a “cursed app” on a… pic.twitter.com/xrvchNeLnQ
— HIDEO_KOJIMA (@HIDEO_KOJIMA_EN) April 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
