తాజావార్తలు

SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విక్టరీ కోసం ఎస్‌ఆర్‌హెచ్ టీంలో కీలక మార్పు?

SRH vs DC Playing XI: టాస్ గెలిచిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విక్టరీ కోసం ఎస్‌ఆర్‌హెచ్ టీంలో కీలక మార్పు?


IPL సన్‌రైజర్స్ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ Playing XI: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ 31వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అఖిబ్ నబీ స్థానంలో నితీష్ రాణాను ఎంపిక చేసినట్లు అక్షర్ పటేల్ ప్రకటించాడు.

ఈరోజు హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం 55% ఉంది. ప్రస్తుతం పిచ్ కవర్లతో కప్పబడి ఉంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ తన నాలుగో విజయం కోసం ఎదురుచూస్తోంది. సొంతగడ్డపై వరుసగా మూడో విజయం సాధించాలని హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఎస్ఆర్‌హెచ్ 13, డీసీ 11 గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, అందులో ఢిల్లీ గెలుపొందింది, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *