వేసవి వచ్చిందంటే మామిడికాయలు..పచ్చళ్లు సందడి మొదలవుతుంది. వేసవిలో ఏడాదిపాటు నిల్వ ఉండేల రకరకాల ఆవకాయలు పెడతారు. పచ్చళ్లలో ఆవకాయ పచ్చడి రుచే వేరు అన్నట్టుగా.. ఎన్నిరకాల పచ్చళ్లు ఉన్నా ఆవకాయ ముందువరుసలో ఉంటుంది. ఇక గోదారోళ్లు ఎంతో సంప్రదాయబద్దంగా పెట్టే ఆవకాయకు డిమాండ్ మామూలుగా ఉండదు మరి. అందుకే ఆవకాయ పెట్టడంలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు మహిళామణులు. రాజమండ్రి అంటేనే రుచులకు పెట్టింది పేరు. ఆ రుచులకే మకుటాయమానంగా నిలిచే ‘ఆవకాయ’ తయారీలో ఇప్పుడు రాజమహేంద్రవరం మహిళలు తమ ప్రతిభను, సంప్రదాయాన్ని చాటారు. జేఎన్ రోడ్డులోని డి1 కన్వెన్షన్లో జరిగిన ‘ఆహా ఆవకాయ సీజన్-3’ పోటీలు నగరంలో సందడిని నింపాయి. ఓ ప్రముఖ రేడియో సంస్థ – ఒక ప్రముఖ చిల్లీ పౌడర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరికి వారు తమదైన ప్రత్యేక శైలిలో, సంప్రదాయ పద్ధతుల్లో ఆవకాయ పచ్చడి పెడుతుంటే, అక్కడి పరిసరాలన్నీ ఆవకాయ ఘుమఘుమలతో నిండిపోయాయి. అక్కడికి వచ్చిన వారందరికీ నోరు ఊరిందంటే అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రియాంక అనుసూరి మాట్లాడుతూ, “మన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయ రుచులను, ఆవకాయ తయారీలోని ప్రత్యేకతలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, మహిళలు రుచులతో పాటు ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్ చూసి షాక్
అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..
Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త
బయటకు వెళ్దామని బైక్ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్
ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్
