
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో ఫైమా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ స్కిట్స్ లో తన కామెడీతో, పంచ్ లతో ఫైమా పాపులర్ అయ్యింది. పంచులు, ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ లేడీ కమెడియన్.అదే క్రమంంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోనూ పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో టీవీ షోల్లోనూ సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఫైమా తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టైటిల్ గెలవకపోయినా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది. ప్రస్తుతం ఫైమా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు.
ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. జబర్దస్త్ ఫైమా తన బిగ్ బాస్ ప్రయాణం, అందులో ఆమె సంపాదించిన సంపాదనపై ఓపెన్ గా చెప్పింది ఫైమా.. ఇంటర్వ్యూయర్ ప్రశ్నలకు స్పందిస్తూ, బిగ్ బాస్ ఇంట్లో సుమారు పది వారాల పాటు ఉన్నట్లు ఫైమా తెలిపింది. ఒక వారానికి 3 లక్షల రూపాయలు, లేదా 1.5 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఉండవచ్చని ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు. అయితే, ఫైమా తక్కువ మొత్తంకే వెళ్లినట్లు తెలిపింది.
ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే
చివరికి, వారానికి 2 లక్షల రూపాయల చొప్పున సుమారు 10 వారాలకు 20 లక్షల రూపాయలకు పైగా ఆమె సంపాదించినట్లు తెలిపింది. అయితే, ఈ మొత్తంలో పన్నులు, ఇతర కోతలు ఉంటాయని తెలిపింది ఫైమా. అలా సంపాదించిన డబ్బులతో అమ్మ నాన్నకు ఇల్లు కట్టించా అని తెలిపింది. అలా వచ్చిన డబ్బులను ఇంటికోసం ఖర్చు చేస్తున్నప్పుడు నాకు పెద్దగా ఏమి అనిపించలేదు అని తెలిపింది ఫైమా.. అమ్మానాన్నకు ఇల్లు కట్టించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఫైమా తెలిపింది. ఒకప్పుడు పండగలు చేసుకోవడానికి డబ్బులు సరిగ్గా ఉండేవి కావు అని గుర్తు చేసుకుంది. అలాగే జబర్దస్త్ ద్వారా దాదాపు నెలకు మూడు లక్షల వరకు సంపాదిస్తున్న అంటూ సరదాగా చెప్పింది ఫైమా.. అలాగే తనకు చిన్నప్పటి నుంచి ఆర్బాటంగా ఉండటం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది ఫైమా..
ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు
View this post on Instagram
Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
