టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ముఖ్యంగా క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ యంగ్ హీరో. ఆ తర్వాత కే- ర్యాంప్ సినిమాతనూ మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం క తరహాలోనే మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. అతని భార్య, నటి రహస్య గోరఖ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తిరుమల శ్రీవారి సన్నిధిలో తమ బిడ్డకు హను అబ్బవరం అని పేరు పెట్టుకున్నారు. ఇక చాలా మంది సెలబ్రిటీల్లాగే కిరణ్ అబ్బవరం దంపతులు కూడా తమ కుమారుడి విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. పిల్లాడి ముఖాన్ని అసలు చూపించడం లేదు. బయటకు తీసుకొచ్చిన కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి పుట్టి వెంట్రుకలు తీయించారు. తన సొంతూరులోనే ఈ కేశఖండన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న పెళ్లిపీటలెక్కారు. ఇక తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా గతేడాది రహస్య హను అబ్బవరంకు జన్మనిచ్చింది.
ఇవి కూడా చదవండి
సొంతూరులో ఘనంగా కిరణ్ అబ్బవరం కుమారుడి కేశ ఖండన మహోత్సవం.. వీడియో
కిరణ్ అబ్బవరం తన కుమారుడు హను
అబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026
కాగా కిరణ్ అబ్బవరం చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నారు. అందులో చెన్నై లవ్ స్టోరీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో పాన్ ఇండియా చిత్రంలోనూ ఈ హీరో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ..
#Chennailovestory 🥰❤️ first single coming soon 🥰..@Kiran_Abbavaram @srigouripriya @MassMovieMakers #kiranabbavaram pic.twitter.com/mhOEv5qIwh
— Rlykoduru_kiran Abbavaram _fans (@RlykoduruF41776) February 9, 2026
Hero @Kiran_Abbavaram & @srigouripriya#ChennaiLoveStory 1st single coming soon #KiranAbbavaram pic.twitter.com/63PDjT2UUY
— YJR (@yjrambabu) February 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
