ఒకప్పుడు నాని అంటే హీరో.. కానీ ఇప్పుడాయన ఓ హిట్ మిషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు చాలా మందికి బ్యాగ్రౌండ్ అయ్యారు న్యాచురల్ స్టార్. అలాంటి స్టార్ బర్త్ డే అంటే ఫ్యాన్స్‌కి పండగే కదా..! మరి ఆ పండగను సెలబ్రేట్ చేయాలంటే కొత్త ముచ్చట్లు ఉండాలి కదా..! మరి నాని బర్త్ డే స్పెషల్స్‌పై ఓ లుక్ వేద్దామా..? నాని బర్త్ డేను హ్యాపీ బర్త్ డే సినిమా అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. సినిమాతో నాని ఎంతగా మమేకమైపోయారో ఈ ఒక్క పోలిక చాలు. ఫిబ్రవరి 24న ఈయన పుట్టిన రోజు సందర్భంగా చేయబోయే సినిమాల ప్రకటనలు, చేస్తున్న సినిమాల నుంచి పాటలు, ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి గ్రీటింగ్స్.. అబ్బో రోజంతా సందడిగా మారిపోయింది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దీన్ని సినిమాలా కాకుండా ఓ యజ్ఞంలా తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 21న విడుదల కానుంది. దీనిపై అంచనాలెలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నాని కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్‌తో వస్తుంది. తాజాగా విడుదలైన పాటతో అంచనాలు మరింత పెరిగాయి. పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్‌లో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక సుజీత్‌తో బ్లడీ రోమియో అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చింది. OG తరహాలో ఇది కూడా గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఇందులో నాని స్టైలిష్ రోల్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ వాయిస్‌తో వచ్చిన ఇంట్రో వీడియో అదిరింది. మొత్తానికి ఇటు ప్యారడైజ్.. అటు బ్లడీ రోమియోతో నాని టాప్ ఫామ్‌లో ఉన్నారిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగేళ్ళ కష్టం వర్సెస్ ఆర్నెళ్ల అదృష్టం.. ఏది గెలుస్తుంది
Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??
Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో
Ajith: కన్‌ఫ్యూజ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ అజిత్
Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన
