తాజావార్తలు

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!


నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

అంతర్జాతీయ బీమా సంస్థ హార్ట్ ఫోర్డ్ సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 1200 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ సెంటర్ హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తీసుకురానుందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి దిశగా కృషి కొనసాగుతోందని తెలిపారు.

హార్ట్ ఫోర్డ్ వంటి రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సంస్థ హైదరాబాద్‌ను తమ అంతర్జాతీయ విస్తరణలో భాగంగా ఎంచుకోవడం నగర ప్రతిభకు నిదర్శనమన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలక అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.

నగరంలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. మారియట్, మెక్‌డొనాల్డ్స్, యూబీఎస్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, సిటిజన్స్ బ్యాంక్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.

ఈ కేంద్రం యూఎస్‌లోని హార్ట్ ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్లతో అనుసంధానంగా పని చేస్తూ ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించనుంది. తెలంగాణలో పారదర్శక పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు, ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయని మంత్రి వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *