తాజావార్తలు

విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం-అద్భుత ప్లానింగ్…

విజయానికి మూలం అద్భుత ప్లానింగ్ | Success Planning Tips in Telugu | A2Z Chronicle

అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం

మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు.

ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది. https://www.youtube.com/watch?v=L4N1q4RNi9I&pp=ygVa4LC14LC_4LCc4LCv4LC-4LCo4LC_4LCV4LC_IOCwruCxguCwsuCwgi3gsIXgsKbgsY3gsK3gsYHgsKQg4LCq4LGN4LCy4LC-4LCo4LC_4LCC4LCX4LGNLi4u

‘ఏదో పని అవుతోంది కదా! ప్రణాళికలు, గాడిద గుడ్డులు, టైమ్ పాటించడం ఎందుకులే’ అనుకునేవారు కూపస్థ మండూకంలా అలాగే వుంటారు.

అలాకాక యం.సెట్ కోసం తొమ్మిదోతరగతి నుండే ప్లానింగ్ వేసుకోవడం, – ఎప్పటికయినా ప్లేబాక్ సింగర్గా రాణించాలని ఇప్పటినుండే సంగీతం నేర్చుకోవడానికి ప్రణాళికని రూపొందించుకోవడం వల్ల భవిష్యత్ జీవితం పూలబాట అవుతుంది.

మీరు విజయం సాధించడానికి ‘ప్లానింగ్’ ఒక అద్భుతమైన పరికరం. ఒక కఠోర గమ్యాన్ని సాధించాలంటే దానిని ఎలా సాధించాలో తెలిపే ఆయుధమే ప్లానింగ్.

కేవలం జీవిత లక్ష్యానికే కాదు, ప్రతి పనికి ప్లానింగ్ అవసరం. మీరు ఇల్లు కట్టాలన్నా, మీరు ఇంకో వూరికి ప్రయాణించాలన్నా మీరు పరీక్షలో చక్కటి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలన్నా, మీరు సంగీత సాహిత్యాలలో చక్కగా రాణించాలన్నా ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా సాధించడం కష్టం.

ఉదాహరణకు మీరు ఇల్లు కట్టాలనుకున్నారు. ఇక్కడ ‘ఇల్లు కట్టుకోవడం’ మీ గమ్యం కాగా, ఆ గమ్య సాధన కోసం వంతులవారీగా ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి.


  1. ఇంటి ప్లాన్ సిద్ధం చేసుకోవడం – వారంలోపు అవ్వాలి.
  2. మున్సిపాలిటీ నుండి ప్లాన్ అప్రూవల్ చేయించుకోవడం – పక్షంలోపు అవ్వాలి.
  3. డబ్బు రెడీ చేసుకోవడం – నెల రోజుల్లో పూర్తవ్వాలి.

4. మేస్ర్తీ, ఇతర కూలీలను నియమించడం – వారంలో పూర్తవ్వాలి.

ఇల్లు మొదలు పెట్టడం, పూర్తి చేయడం – నాలుగు నెలలు

    ఫలితంగా ఆరు నెలలలోపు ఇల్లు కట్టడం పూర్తవ్వాలి.

    ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ రావడమే ప్లానింగ్. సరైన ప్లానింగ్ లేకపోతే గమ్య సాధన అస్తవ్యస్తం అవుతుంది.

    ఈ ప్రణాళిక వేసుకోవడం వల్ల మనం అనుకున్న పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయా లేదో అంచనా వేయడానికి వీలవుతుంది. అంతేకాక మన సామర్థ్యం సైతం వెల్లడవుతుంది.

    vijayaniki-moolam-adbhuta-planning

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *