ఒక చిన్న స్టిక్కర్... సమయానికి మీ ప్రాణాలు కాపాడే సంజీవనిగా మారితే ఎలా ఉంటుంది? ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉండే నగరంలో మిమ్మల్ని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి, మీ సమయాన్ని కూడా ఆదా చేస్తే?
అంతకంటే ఏం కావాలి... ఇంతకీ ఆ మ్యాజిక్ స్టిక్కర్ సంగతులేంటంటే...
అర్ధరాత్రి రోడ్డుపైన యాక్సిడెంట్… తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. కొందరు ‘అయ్యోపాపం’ అంటుంటే, మరికొందరు వాళ్ల ఆత్మీయులకు సమాచారం చేరవేసి, మెరుగైన వైద్యం అందిద్దామని అనిపించినా- అతను ఎవరో ఏంటో వివరాలు తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు.
ఈలోపు విలువైన సమయం కాస్తా వృథా అయిపోతూ ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో! ఈ సమస్యకు అతి తక్కువ ఖర్చులో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లతో పరిష్కారం అందిస్తున్నాయి.
ఇకోభారత్, నేక్ఇన్సాన్ వంటి సంస్థలు. ఈ స్టిక్కర్లను వాడుకోవడం చాలా తేలిక. బండికి అతికించుకుని యాప్ ద్వారా రిజిస్టర్ కావాలి.
అత్యవసర సమయంలో ఎవరైనా ఈ స్టిక్కర్లని స్కాన్ చేస్తే చాలు… అందులో అతని కుటుంబ వివరాలూ, చిరునామా, ఫోన్ నంబర్, బ్లడ్ గ్రూప్ తదితరాలన్నీ ఉంటాయి.
అంతేనా, అలా స్కాన్ చేయగానే బాధితుల కుటుంబ సభ్యులకు కాల్ వెళ్లిపోతుంది,
మరోవైపు ...అంబులెన్సుకూ… పిలుపు అందుతుంది. ఎక్కువ సమయం వృదా కాకుండా ప్రాణాలు కాపాడుకునే అవకాశం కృస్తుందీ ఎమర్జెన్సీ స్టిక్కర్.
ఒక్కసారి బండికి క్కర్ని అతికించుకుంటే ఐదేళ్లపాటు పనిచేస్తుంది. బాగుంది కదూ…
సింపుల్ టెక్నాలజీతో ప్రాణాలు కాపాడుకునే ……ఈ చిన్న అవకాశం.
పార్కింగ్ సమస్యలకు చెక్…
పార్కింగ్… నగరంలో ఉండే వాహనదారులకి మాత్రమే తెలుసు ఆ కష్టాల గురించి. బండి పార్క్ చేద్దామంటే అసలు జాగా దొరకదు.
ఎక్కడో ఒక చోట స్థలం ఉందని పార్క్ చేసి పని చూసుకుని తిరిగి వచ్చి చూస్తే, అక్కడ మన బండి ఉండదు. ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లిపోయుంటారు. దాన్ని విడిపించుకోవడానికి ఇక మన కష్టాలు అలా కాకుండా ఎవరైనా మీకు చూడాలి.
ఫోన్ చేసి ‘బాబూ, మీ బండిని కాస్త ‘పక్కకు తీస్తారా’ అని మర్యాదగా అడిగితే ఎంత బాగుంటుంది? పోనీ మీరే ఆఫీసుకెళ్లాలి… కానీ మీ కార్ తీద్దామంటే `పక్క అపార్ట్మెంట్’ ఆయన కారునో, బైకో అడ్డంగా పెట్టాడు. ఆయన ఫోన్ నంబర్ మీకు తెలియదు. ఎవరినైనా వివరాలు అడిగి తెలుసుకునేంత సమయం మీకు లేదు.
ఇలాంటి సమయాల్లో కూడా ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. వీటిని స్కాన్ చేస్తే చాలు, వాహన యజమానికి కాల్ వెళ్లిపోతుంది.
రూ.99 మాత్రమే!

మరైతే ఈ స్టిక్కర్ చాలా ఖరీదు ఉంటుందని అనుకుంటున్నారేమో. అబ్బే అదేం లేదు.. రూ.99 మాత్రమే!
