కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయం సాధించిన మహిళ విజయలక్ష్మి. నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి.
పేద కుటుంబ నేపథ్యం, పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువును కొనసాగించిన ఆమె పట్టుదలే ఆమెను విజయతీరాలకు చేర్చింది.

విజయలక్ష్మి
కుటుంబాన్ని పోషిస్తూ ట్రాక్టర్ నడుపుతున్న భర్త ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. పరిస్థితులను సవాల్‌గా తీసుకుని అహర్నిశలు శ్రమిస్తూ చదువుపై దృష్టి పెట్టింది.
అదే పట్టుదల, సంకల్పబలంతో గ్రూప్–2 పరీక్షలో విజయం సాధించి ASO (Assistant Section Officer)గా ఎంపికయ్యారు విజయలక్ష్మి.
కష్టాలే కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిరంతర శ్రమ ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని ఆమె జీవితం నిరూపిస్తోంది.
