Virat Kohli : శుక్రవారం తెల్లవారుజామున విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ @virat.kohli అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఎవరైనా కోహ్లీ ప్రొఫైల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పేజీ అందుబాటులో లేదు లేదా లింక్ విరిగిపోయింది అనే మెసేజ్‌లు రావడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏకంగా 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఖాతా ఇలా చెప్పాపెట్టకుండా డియాక్టివేట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో హ్యాకర్లు కోహ్లీ అకౌంట్‌ను హ్యాక్ చేశారా? లేక ఆయనే స్వయంగా డిలీట్ చేశారా? అన్న అనుమానాలతో ఎక్స్‌లో చర్చలు ఊపందుకున్నాయి.
విరాట్ నోరు విప్పకపోవడంతో..ఆయన అభిమానులు నేరుగా ఆయన భార్య అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ పేజీకి తరలివెళ్లారు. ఆమె పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. అక్కా.. విరాట్ అకౌంట్ ఏమైంది?, అన్న అకౌంట్ ఓపెన్ అవ్వడం లేదు, కాస్త చెప్పండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ వినోదభరితమైన కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం విరాట్ భద్రత గురించి ఆందోళన చెందారు. కింగ్ కోహ్లీ ఫామ్ పరంగా ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నాడు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకున్న తరుణంలో ఇలా జరగడం నెటిజన్లను మరింత అయోమయానికి గురిచేసింది.
It’s 2 AM man and Kohli FC has started spamming under Instagram’s official handle.
This guy has an unreal, crazy fan following 😭🔥 pic.twitter.com/nnctnCsHhO
— 𝐊𝐨𝐡𝐥𝐢𝐧𝐚𝐭!𝟎𝐧_👑🚩 (@bholination) January 29, 2026
మొత్తానికి కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా మళ్లీ పునరుద్ధరించబడింది. అయితే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక కోహ్లీ కావాలనే డిజిటల్ డిటాక్స్ కోసం అకౌంట్‌ను తాత్కాలికంగా ఆపేయాలని చూశారా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ లోపు సోషల్ మీడియాలో ఒక పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్తున్న మీమ్ కోహ్లీ మాయం అవ్వడంపై ఇంటర్నెట్ ను ఊపేసింది. కోహ్లీ అకౌంట్ తిరిగి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క విషయం మాత్రం క్లియర్ అయింది.. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కేవలం కొన్ని గంటలు సోషల్ మీడియాలో కనిపించకపోతేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి కలకలం రేగుతుందో ఈ సంఘటన నిరూపించింది. టెక్నికల్ గ్లిచ్ అయినా లేక కావాలనే చేసినా, కింగ్ మౌనంగా ఉంటే ప్రపంచం మొత్తం దాని ప్రతిధ్వని కోసం ఎదురుచూస్తుందని మరోసారి అర్థమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
