తాజావార్తలు

ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..


ప్రస్తుతం కృత్రిమ మేధస్సు చాట్‌బాట్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈమెయిల్స్ రాయడం నుంచి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం వరకు ప్రతి ఒక్కరూ వీటిని వాడుతున్నారు. అయితే, ఏఐతో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రశ్నల రూపంలో మనం ఇచ్చే సమాచారం కొన్నిసార్లు మన గోప్యతకు భంగం కలిగించవచ్చు. జాతీయ మీడియ నివేదిక ప్రకారం ఏఐ చాట్‌బాట్‌లలో పొరపాటున కూడా పంచుకోకూడని ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే. మొదటిది పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు. సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకింగ్ పిన్‌లను ఎప్పుడూ ఏఐ చాట్‌బాట్‌లలో నమోదు చేయకూడదు. లాగిన్ సమస్యలు ఉంటే వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే సహాయం పొందవచ్చు. రెండవది బ్యాంకు, చెల్లింపుల వివరాలు. బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ వంటి సున్నితమైన ఆర్థిక వివరాలను షేర్ చేయకూడదు. మూడవది ఆధార్, పాస్‌పోర్టు వంటి గుర్తింపు పత్రాలు. వీటిని చాట్‌బాట్‌లకు అప్‌లోడ్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉంది. నాలుగవది ఆఫీసు రహస్య పత్రాలు. కంపెనీల అంతర్గత నివేదికలు, క్లయింట్ల వివరాలను ఏఐలో పెట్టడం వల్ల సంస్థాగత గోప్యత దెబ్బతింటుంది. ఐదవది ఇతరుల వ్యక్తిగత సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగుల వ్యక్తిగత సమస్యలు, వైద్య రికార్డులను వారి అనుమతి లేకుండా పంచుకోకూడదు. అవసరమైతే పేర్లు, ఫోన్ నంబర్లు వంటి గుర్తింపు వివరాలను తొలగించి సాధారణంగా వివరించడం ద్వారా మన వ్యక్తిగత డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. కొత్త నిబంధనలు ఇవే!

పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *