తాజావార్తలు

క్రిస్పీ ఆలూ బోండా.. అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్ రుచి


నానబెట్టిన శెనగపిండిని మళ్ళీ ఒకసారి కలిపి, చివరిగా పావు టీ స్పూన్ వంటసోడా, రెండు టీ స్పూన్ల వేడి నూనె వేసి కలపండి. వేడి నూనె వేయడం వలన బోండాలు క్రిస్పీగా వస్తాయి, వంటసోడా ఎక్కువగా అవసరం ఉండదు. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఆలూ ఉండలను ఒక్కొక్కటిగా పిండిలో బాగా ముంచి, అదనపు పిండిని వంపేసి, మీడియం వేడెక్కిన నూనెలోకి జాగ్రత్తగా వేయండి. చేతితో వేయడం కష్టంగా అనిపిస్తే స్పూన్‌ను ఉపయోగించండి, అలా అయితే బోండాలు రౌండ్‌గా, నీట్‌గా వస్తాయి. మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వెంటనే తిప్పకుండా, ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్‌గా వేయించండి. వేగిన బోండాలను నూనె నుండి తీసి ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా తయారు చేసిన క్రిస్పీ ఆలూ బోండాలను వేడివేడిగా గ్రీన్ చట్నీతో లేదా వెల్లుల్లి కారంతో సర్వ్ చేయండి. ఈ రుచికి ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *