బుధవారం వరకు స్మైల్‌గేట్ కంపెనీ పూర్తిగా క్వాన్ హ్యుక్-బిన్ కంట్రోల్‌లోనే ఉండేది. కానీ కోర్టు తీర్పుతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. కంపెనీలోని 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్ పేరున బదిలీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షేర్లతో పాటు అదనంగా మరో 65 బిలియన్ల వోన్లను క్యాష్ రూపంలో తన మాజీ భార్యకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు తీర్పు కొరియా కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!
కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సమయంలో క్వాన్ మాజీ భార్య లీ హ్వా-జిన్.. స్మైల్‌గేట్ కంపెనీలో ఏకంగా 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేశారు. కంపెనీ తొలి రోజుల్లో తాను కూడా ఆర్థికంగా సపోర్ట్ చేశానని, కంపెనీ అభివృద్ధి వెనుక తన పాత్ర ఉందని ఆమె లాయర్లు కోర్టులో వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. బిజినెస్ సక్సెస్‌లో లైఫ్ పార్ట్‌నర్ కష్టానికి గుర్తింపుగా కోర్టు ఫైనల్‌గా ఆమెకు భారీ మొత్తంలో వాటాను దక్కేలా సంచలన తీర్పు ఇచ్చింది!
అయితే తన మాజీ భార్య లీ హ్వా-జిన్ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని, అసలు కంపెనీ కోసం ఎలాంటి పనీ చేయలేదని క్వాన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ ఏడాది జనవరిలో స్మైల్‌గేట్ కంపెనీ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ, కంపెనీకి సంబంధించిన ప్రారంభ మూలధనం పూర్తిగా క్వాన్‌దేనని స్పష్టం చేసింది. క్వాన్, లీ ఇద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత 2002లో క్వాన్ ‘స్మైల్‌గేట్’ ను స్థాపించారు. కంపెనీ రూపొందించిన గేమ్‌లలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయినవి చాలా ఉన్నాయి. వాటిలో ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్ ‘క్రాస్‌ఫైర్’ , యాక్షన్ రోల్-ప్లేయింగ్ గేమ్ ‘లాస్ట్ ఆర్క్’ వంటివి ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఒకప్పుడు గేమింగ్ పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించిన ఈ గేమింగ్ కపుల్ లవ్‌స్టోరీ ఇప్పుడు విడాకుల రూపంలో వార్తల్లో నిలిచింది!
ఫ్యామిలీ లైఫ్‌కు అంకితం
కంపెనీని భర్త చూసుకుంటూ ఉండగా తను దాదాపు 20 ఏళ్ల పాటు పిల్లలను పెంచడం, ఇంటి బాధ్యతలపై దృష్టి పెట్టినట్లు లీ హ్వా-జిన్ కోర్టుకు తెలిపారు. ఇంటిని, పిల్లలను ఒంటి చేత్తో మేనేజ్ చేసి భర్తకు సపోర్ట్ చేశానని ఆమె కోర్టులో తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.
సౌత్ కొరియా చరిత్రలోనే బిగ్గెస్ట్ డైవర్స్ సెటిల్‌మెంట్‌గా సంచలనం సృష్టించింది ఈ తీర్పు. కోర్టు తీర్పుపై ఇరువర్గాలు సంతృప్తి చెందని సందర్భంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ తీర్పును సవాలు చేసే వెసులుబాటు ఇరుపక్షాలకు ఉండటంతో.. ఈ హై-ప్రొఫైల్ గేమింగ్ బిలియనీర్ విడాకుల వివాదం ముందు ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే దానిపై టెక్, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది!
