ఈ త్రికూటాలయం చుట్టూ 382/1/2 & 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించ బోతుంది.. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ త్రికూటాలయం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యటన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు
