Fake PhonePe Payment: హైదరాబాద్ అంబర్‌పేటలో ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఫోన్‌పే, గూగుల్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులతో పాటు ఓ బాల నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.12,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అంబర్‌పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
అంబర్‌పేట శివంరోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు తీసుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే వారిని నిందితులు టార్గెట్ చేసేవారని పోలీసులు తెలిపారు. మాటల్లో పెట్టి.. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించేవారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న తర్వాత.. నకిలీ యాప్ ద్వారా తయారు చేసిన ‘ట్రాన్సాక్షన్ సక్సెస్’ స్క్రీన్‌ను చూపించి అక్కడి నుంచి పరారయ్యేవారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!
ఈ తరహా మోసాలకు సంబంధించి గత నెలలో అంబర్‌పేట పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబర్‌పేట ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.12,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల పాత్రపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్‌పే, గూగుల్‌పే లావాదేవీల సమయంలో స్క్రీన్‌షాట్ లేదా ‘పేమెంట్ సక్సెస్’ మెసేజ్‌ను మాత్రమే నమ్మి నగదు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. డబ్బు నిజంగా తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో బ్యాంక్ యాప్, ఖాతా బ్యాలెన్స్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వయంగా ధృవీకరించుకున్న తర్వాతే నగదు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డ్ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
