స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం.
కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అంతే కాకుండా ఆర్థికమైన ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది. పెళ్లి కాని వారికి త్వరలో వివాహం జరుగుతుంది అని దీని సూచన. అంతే కాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పండిన అరటి పండ్లు తినడం వలన ఇది ఆరోగ్యం బాగుపడటం, మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. అంతే కాకుండా గురు బలం కూడ పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయని చెబుతున్నారు పండితులు.
అలాగే పండిన అరటి పండ్లు చూడటం చాలా శుభప్రదం, ఇది మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఒక వేళ మీ కలలో పచ్చి అరటికాయలు కనిపిస్తే మీరు చాలా ఓపిక పట్టాలి. అరటి పండు తిన్నట్లు కల రావడం చాలా మంచిదంట. ఇది ఆరోగ్యం, సంతోషం, కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు.
అరటి పండ్లు ఇతరులకు ఇస్తున్నట్లు కలరావడం కూడా చాలామంచిది. ఇది మీరు పుణ్యం చేస్తున్నారని సూచిస్తుంది. అంతే కాకుండా, మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండ్లు ఏవిధంగా కనిపించినా చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.





