బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతుండగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శనివారం ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడంతో దేశీయంగా కూడా పెరుగుదలను నమోదు చేశాయి. గత రెండు రోజులగా ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. శనివారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,290 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,350 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.700 మేర పెరిగింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,290 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,350గా కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,290 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350 పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,440 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,450 వద్ద ట్రేడవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350గా ఉంది.
వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2.35 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.30 లక్షల వద్ద ట్రేడవుతోంది.





