దేశంలో మళ్లీ కరోనా ఛాయలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏపీలో ఇటీవల కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటుండటం, కొన్ని నగరాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు మరోసారి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే కరోనా మరణాలు స్వల్ప మొత్తంలో సంభవించినా.. మళ్లీ 2021 నాటి తీవ్ర పరిస్థితులు రావని వైద్యులు అంటున్నారు. కేసుల పెరుగుదల స్థానికంగానే ఉంటుందంటున్న నిపుణులు.. గత వేవ్‌లలో కనిపించినట్లుగా ఆస్పత్రుల్లో రోగుల రద్దీ, ఆక్సిజన్ కొరత, ఐసీయూలు నిండిపోవడం వంటివి ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. దాదాపు ప్రతీఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల ద్వారా ఏర్పడిన రోగనిరోధక శక్తి వంటివి చాలా మందిలో తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని అంటున్నారు.
అయితే కరోనా అనేది ఎక్కడికి పోదు. వైరస్ ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో వస్తూ ఉంటుంది. అనారోగ్యాల బారిన ఎప్పుడైనా పడవచ్చు. దీంతో సరైన హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నాయి. దీని వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు ఆర్ధిక భారం తగ్గుతుందంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మరోసారి హెల్త్ ఇన్యూరెన్స్ గురించి చర్చ నడుస్తోంది. కరోనాకు కూడా వర్తించేలా ఇన్యూరెన్స్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కోవిడ్ సంబంధిత ప్రతి ఖర్చు హెల్త్ ఇన్యూరెన్స్ ద్వారా ఆటోమేటిక్‌గా భర్తీ చేయబడుతుందని చాలా మంది తప్పుగా భావిస్తున్నారు. కవరేజీ పరిధి పూర్తిగా పాలసీ అనేది నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. చాలా ఆరోగ్య బీమా పథకాలు కోవిడ్-19ని ఇతర అనారోగ్యాల మాదిరిగానే పరిగణిస్తున్నాయి. చికిత్స పాలసీ నిబంధనల పరిధిలోకి వస్తే.. ఆసుపత్రిలో చేరడం , ఐసీయూ సంరక్షణ, చేరినప్పుడు డాక్టర్ సందర్శనలు, రోగ నిర్ధారణ పరీక్షలు సాధారణంగా కవర్ అవుతాయి.
కానీ ప్రతీ ఖర్చు తిరిగి చెల్లించబడుతుందని దీని అర్థం కాదు. ప్రజలు ఎక్కువగా గృహ చికిత్స గురించి పట్టించుకోరు. చాలా మంది కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటారు. కానీ పాలసీలో గృహ సంరక్షణ ప్రత్యేకంగా చేర్చబడి ఉంటే.. పల్స్ ఆక్సిమీటర్లు, మాస్కులు, శానిటైజర్లు, సప్లిమెంట్లు, కొన్ని మందుల వంటి ఖర్చులు కవర్ అవుతాయి. టెలి-కన్సల్టేషన్లు, హోమ్ నర్సింగ్ సేవలు ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భాగంగా ఉంటేనే కవర్ అవుతాయి. ఇక క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు నెట్వర్క్ కాని ఆస్పత్రిలో చికిత్స పొందితే ముందుగా బిల్లు చెల్లించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకు సమయం పట్టవచ్చు.బీమా సంస్థక్లెయిమ్ షరతులపై ఆధారపడి ఉంటుంది.
