తాజావార్తలు

హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..? కొనేముందు ఇవి తెలుసుకోండి..

హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..? కొనేముందు ఇవి తెలుసుకోండి..


భారతీయ రోడ్లపై రోజువారీ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, కాలేజీ విద్యార్థులకు 125cc బైక్‌లు ఎప్పుడూ ఒక వరప్రసాదంగానే నిలుస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ల నేపథ్యంలో.. ఎక్కువ మైలేజ్ ఇస్తూ, నడపడానికి సౌకర్యంగా ఉండే బైక్‌లనే వాహనదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 100cc బైక్‌లలో ఆశించిన వేగం ఉండదని, అలాగే 150cc బైక్‌లలో మైలేజ్ తక్కువగా ఉంటుందని భావించే వారికి 125cc సెగ్మెంట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కేటగిరీలో మైలేజ్, స్టైల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మధ్యతరగతి ప్రజల మనసు దోచుకున్న రెండు బెస్ట్ బైక్‌లు.. హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్ 125. ప్రస్తుతం మార్కెట్లో ఈ రెండింటి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ బైక్ ఎలాంటి ఫీచర్లను అందిస్తుందో తెలుసుకుందాం..

హోండా ఎస్పీ 125: నమ్మకం.. నిశబ్ద ప్రయాణం..

హోండా కంపెనీ తన ఇంజిన్ రిఫైన్‌మెంట్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులకు పెట్టింది పేరు. లాంగ్ టర్మ్ వాడకానికి ఈ బైక్ ఎంతో అనువైనది.

ఇంజిన్ – టెక్నాలజీ: ఇందులో ఉన్న eSP టెక్నాలజీ వల్ల బైక్ ఎలాంటి సబ్దం లేకుండా స్టార్ట్ అవుతుంది.

రైడింగ్ – గేర్‌బాక్స్: 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా స్మూత్‌గా వెళ్తుంది. నగర ట్రాఫిక్‌లో సులభంగా హ్యాండిల్ చేయవచ్చు.

మైలేజ్: మీరు మైలేజ్ ఎక్కువగా ఆశించే వారైతే.. ఈ బైక్ లీటరుకు సుమారు 60 నుండి 65 కిలోమీటర్ల మైలేజ్‌ను చాలా సులభంగా ఇస్తుంది.

ప్లస్ పాయింట్స్: సాంప్రదాయక డైమండ్ ఫ్రేమ్ డిజైన్, కుటుంబంతో ప్రయాణించడానికి వీలుగా ఉండే పొడవైన సీటు దీని ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో సైతం హోండాకు ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనికి అదనపు బలం.

టీవీఎస్ రైడర్ 125: స్టైలిష్ లుక్.. మోడ్రన్ ఫీచర్లు

టీవీఎస్ రైడర్ 125 మోడ్రన్ టెక్నాలజీ, స్పోర్టీ లుక్‌తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ ఇవ్వడం దీని ప్లస్ పాయింట్.125cc సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఇందులో ఎకో, పవర్ మోడ్స్ అందించారు. ఇది రైడర్లకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీని LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు రైడింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. సీటు కింద చిన్న వస్తువులు దాచుకోవడానికి అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ బైక్‌లో మోనోషాక్ సస్పెన్షన్ అందించడం వల్ల రైడింగ్ కంఫర్ట్ అద్భుతంగా ఉంటుంది. బైక్ ఎగ్జాస్ట్ సౌండ్, పికప్ సామర్థ్యం యూత్‌కు బాగా నచ్చుతాయి.

బైక్ మైలేజ్, లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి..

మీరు ఏ బైక్ కొన్నా.. దాని లైఫ్ బాగుండాలంటే ఈ క్రింది మెయింటెనెన్స్ చిట్కాలు తప్పక పాటించాలి:

ఫస్ట్ సర్వీసింగ్: కొత్త బైక్ కొన్న తర్వాత మొదటి 1000 కిలోమీటర్ల లోపే ఫస్ట్ సర్వీస్ ఖచ్చితంగా చేయించాలి.

ఆయిల్ – చైన్ లుబ్రికేషన్: సరైన సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ప్రతి 500 కిలోమీటర్లకు ఒకసారి చైన్ క్లీన్ చేసి లుబ్రికేట్ చేయడం వల్ల బైక్ స్మూత్‌గా నడుస్తుంది.

టయర్ ప్రెజర్: మైలేజ్ బాగా రావాలంటే ముందు టయర్‌లో 25 psi, వెనుక టయర్‌లో 32 psi గాలి ఒత్తిడిని మెయింటెనెన్స్ చేయాలి.

క్లచ్ వాడకం: చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్‌ను సగం పట్టుకుని రేస్ చేస్తుంటారు. దీనివల్ల క్లచ్ ప్లేట్లు త్వరగా పాడైపోతాయి. అలాగే లో గేర్‌లో ఎక్కువ స్పీడ్ వెళ్లకూడదు. ఎల్లప్పుడూ కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వాడటం వల్ల బైక్ రీసేల్ వాల్యూ బాగుంటుంది.

ఏ బైక్ కొంటే బెటర్?

మీకు ఎలాంటి తలనొప్పి లేని, అత్యంత నమ్మకమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ బైక్ కావాలనుకుంటే హోండా SP 125 బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా కళ్లు చెదిరే స్పోర్టీ లుక్, అద్భుతమైన పికప్, బ్లూటూత్ నావిగేషన్ వంటి మోడ్రన్ ఫీచర్లు కావాలనుకుంటే టీవీఎస్ రైడర్ 125 సూపర్ ఛాయిస్. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన బైక్‌ను ఎంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *