తాజావార్తలు

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు


భారత్‌, పాకిస్థాన్‌ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు. వృదాప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. 1947లో జరిగిన భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ అపురూప దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి. మే 22న ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోను షేర్‌ చేసారు. అందులో ఇద్దరు వృద్ధులు మొదట ఒకరినొకరు మౌనంగా చూసుకుంటూ, కాలంతో మారిన ముఖాల్లో పాత గుర్తులను వెతుక్కోవడం చేసారు. కొద్ది క్షణాల తర్వాత, భావోద్వేగంతో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని నిలబడిపోయారు. వారు తమ చిన్ననాటి స్నేహితులైన గురుదేవ్ సింగ్, రంజిత్ సింగ్ పేర్లను, స్కూల్‌ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కనిపించింది.1947 దేశ విభజన భారత ఉపఖండ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటి. విభజన వల్ల లక్షలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి, ఎందరో స్నేహితులు, బంధువులు శాశ్వతంగా విడిపోయారు. దశాబ్దాల తర్వాత ఆ స్నేహితుల కలయిక నాటి గాయాలను మరోసారి గుర్తుచేస్తూనే, మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పింది. వీడియో చూసిన నెటిజన్లు “స్నేహానికి మతం లేదు”, “వారు మళ్లీ కలవాలని రాసిపెట్టి ఉంది” అంటూ భావోద్వేగ కామెంట్లు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, ఈ ఇద్దరు మిత్రుల ప్రస్తుత నివాసం, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!

ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్

Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్‌ గురించి వాగితే ఇట్లే ఉంటది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *