రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్!
కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్ అయిన వారి సంఖ్యను రైల్వే…
